![]() |
![]() |

స్టార్ మాలో ప్రసారమవుతున్న 'గుప్పెడంత మనసు' సీరియల్ ఎపిసోడ్-678 లోకి అడుగుపెట్టింది. కాగా శనివారం జరిగిన ఎపిసోడ్ లో... కాలేజీలో రాజీవ్ చేసిన గొడవని జగతి, మహేంద్రలు గుర్తుచేసుకుంటారు. "అసలు వసుధార ఎందుకు ఇలా చేస్తుంది.. పెళ్లి చేసుకుంది.. తన లైఫ్ చూసుకోకుండా, మళ్ళీ రిషి జీవితంలోకి వచ్చి ఇబ్బంది పెడుతుంది.. చక్రపాణి మన ఇంటికి వచ్చి ఏదో చెప్పాలనుకున్నాడు.. మనం వెళ్లి చక్రపాణిని అడిగితే అసలు నిజం బయట పడుతుంది" అని జగతితో మహేంద్ర అంటాడు. అలా అనుకుంటూ ఇద్దరు బయలుదేరుతారు.
అలా ఇద్దరు వెళ్ళగానే.. "రండి సర్.. రండి టీచరమ్మా" అంటూ కూర్చోమంటాడు. చక్రపాణికి కాలేజీకి వచ్చి రాజీవ్ చేసిన గొడవ గురించి చెప్తారు. అసలు వసుధార మెడలో తాళి ఎవరు కట్టారు అంటూ ప్రశ్నిస్తుంది జగతి. వసుధార ఎవరికీ చెప్పొద్దూ అని ఒట్టు వేయించుకున్న మాటలు గుర్తు చేసుకుంటాడు చక్రపాణి. అంతలోనే వసుధార వస్తుంది. రాజీవ్ తనని రూమ్ లో బంధించిన విషయం దగ్గర నుండి రిషిని చంపేస్తానని బెదిరించిన విషయం వరకు అంతా చెప్తుంది వసుధార. ఈ తాళి ఏంటని జగతి అడుగగా.. "అప్పుడు ఏం చెయ్యాలో తెలియక నేనే తాళి మెడలో వేసుకున్నాను. ఇది మీరు పంపిన తాళి. రిషి సర్ నా మెడలో వేశారని అనుకొని నా ఇష్టప్రకారంగా నాకు నేను నా మెడలో వేసుకున్న తాళి. అమ్మేమో హాస్పిటల్ లో, నేనేమో పోలీస్ స్టేషన్ లో.. నిజానిజాలు చెప్పే పరిస్థితిలో నేను లేను" అంటూ చెప్తుంది వసుధార. ఇప్పటికైనా ఈ నిజం రిషికి చెప్పు వసు అని జగతి అంటుంది. "లేదు మేడం.. రిషి సర్ కి మనసులో ఒకటుంది. అది తనంతట తానే తెలుసుకొని, వాస్తవం తెలుసుకోవాలి.. రిషి సార్ మా ప్రేమని బ్రతికించుకుంటాడు. దయచేసి మా ఇద్దరి మధ్యలో ఎవరు కలుగుజేసుకోవద్దు" అని వసుధార చెప్తుంది. వసుధార మాటలు విన్న జగతి, మహేంద్రలు.. సారీ వసు అని దగ్గరికి తీసుకుంటుంది జగతి. "నిన్ను అర్ధం చేసుకోకుండా తప్పుగా మాట్లాడాం వసుధార" అని మహేంద్ర అంటాడు..
"రిషి సర్ లేకపోతే నేను బతకలేనని నేను ఎలా తెలుసుకున్నానో, రిషి సర్ కూడా తెలుసుకోవాలి. వసుధార చివరి శ్వాస వరకు రిషి సర్ కోసమే జీవిస్తుందని తెలుసుకోవాలి.. నా మెడలో ఎవరో తాళి కట్టారని ఎలా అనుకుంటారు? నిజం తెలుసుకోవాలి మేడం.. మీరు మాత్రం రిషి సర్ కి నిజం చెప్తే మా ప్రేమ మీద ఒట్టే" అని జగతి చేతిని తన నెత్తి మీద పెట్టుకుంటుంది వసుధార. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |